డిసెంబర్ 16న రైల్వే పెన్షన్ అదాలత్

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్​ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ నెల 16న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్​రైల్ నిలయం నాలుగో అంతస్తులోని ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆఫీసులో ఉదయం 8 గంటల నుంచి  మధ్యాహ్నం 3 వరకు పెన్షన్ అదాలత్ జరుగుతుందన్నారు. 

అదే సమయంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు  నాందేడ్ ఇతర యూనిట్లలో విడివిడిగా పెన్షన్​అదాలత్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రిటైర్డ్​రైల్వే ఉద్యోగులు తన సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.