ఐరన్​ మ్యాన్​ ట్రయథ్లాన్ శ్రేయాస్ గెలిచాడు

ఐరన్​ మ్యాన్​ ట్రయథ్లాన్ శ్రేయాస్ గెలిచాడు
  • 3.8 కిలోమీటర్ల ఈత
  • ఆ తర్వాత 180 కిలోమీటర్ల సైక్లింగ్
  • 42.2 కిలోమీటర్ల పరుగు 

ప్రపంచంలో అత్యంత కష్టమైన ఫీట్లలో ఒకటైన ఐరన్​ మ్యాన్​ ట్రయథ్లాన్​  ఫినిష్​ లైన్​కి దారి ఇది. దీన్ని రీసెంట్​గా బెంగళూరుకి చెందిన 32 ఏండ్ల శ్రేయాస్​ జి హౌసర్ సక్సెస్​ ఫుల్​గా చేరుకున్నాడు. అది కూడా పదమూడు గంటల ఇరవై మూడు నిమిషాల్లోనే.

ఐరన్​ మ్యాన్​ ట్రయథ్లాన్​ వన్​ డే స్పోర్ట్​. ఏటా జర్మనీలో జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవాళ్లు ఫినిష్​ లైన్​ చేరుకునే వరకు ఒంటరిగానే సర్వైవ్​ అవ్వాలి. అంటే సైకిల్​ పాడైతే వాళ్లంతట వాళ్లే రిపేర్​ చేసుకోవాలి. మధ్యలో గాయాలైనా ఎలాంటి సాయం అందదు. అలాంటి పోటీని రైల్వే ఆఫీసర్​ శ్రేయాస్​ 13 గంటల ఇరవై మూడు నిమిషాల్లో పూర్తి చేశాడు. ఈ విషయాన్ని మినిస్టరీ ఆఫ్​ రైల్వేస్​ సోషల్​ మీడియాలో  పోస్ట్​ చేసింది. అయితే ఈ ఫీట్​ని సాధించడానికి మూడేండ్లు కష్టపడ్డాడట శ్రేయాస్​. రోజూ ఉదయం ఐదున్నరకి లేచి పరుగులు పెట్టాడు. ఆఫీస్​ నుంచి తిరిగొచ్చాక గంటల తరబడి మళ్లీ  వర్కవుట్​ చేశాడు. హెల్దీ డైట్​ ఫాలో అయ్యాడు.ఈ ఫినిష్​ లైన్​ చేరుకోవడానికి సైక్లింగ్ చేస్తున్నప్పుడు శ్రేయాస్​ మోకాలికి గాయం కూడా అయింది . అయినా సరే వెనకడుగేయకుండా సక్సెస్​ఫుల్​గా ఫినిష్​ లైన్​ చేరుకుని రికార్డు సృష్టించాడు శ్రేయాస్​. 

మరిన్ని వార్తలు