అవమానకరమైన మతోన్మాదం ఒంటరిని చేయడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందని, భారతదేశం బాహ్యంగా బలహీనమవుతోందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం, ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బీజేపీ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది.
ఈ సందర్భంగా రాహుల్ స్పందించారు. అంతర్గతంగా విభజించబడిన భారతదేశం ఇప్పుడు బాహ్యంగా బలహీనంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దెబ్బతిందన్నారు. మహ్మద్ ప్రవక్త, అతని భార్యపై నుపుర్ శర్మ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. యూపీలోని కాన్పూర్ లో మత హింసుక దారి తీసింది. దీని వల్ల 40 మందికి గాయాలయ్యాయి. ఖతార్, కువైట్ గల్ప్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై ఇరుదేశాల భారత రాయబారులను పిలిపించి.. నిరసన నోట్స్ ఇచ్చాయి.
Divided internally, India becomes weak externally.
— Rahul Gandhi (@RahulGandhi) June 6, 2022
BJP’s shameful bigotry has not only isolated us, but also damaged India’s standing globally.
మరిన్ని వార్తల కోసం : -
షెహబాజ్ నీతులు చెప్పడం మానుకో
నుపుర్ శర్మకు బెదిరింపులు
