సోనియా గాంధీకి రాహుల్ గాంధీ సర్ప్రైజ్ గిప్ట్

సోనియా గాంధీకి రాహుల్ గాంధీ సర్ప్రైజ్ గిప్ట్

రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. గోవా టూర్ వెళ్లిన రాహుల్ గాంధీ వస్తూ వస్తూ...తన తల్లి కోసం ఓ బహుమతి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సర్ ప్రైజ్ బహుమతిని చూసి సోనియా గాంధీ మురిసిపోయారు. రాహుల్ గాంధీ నుంచి ఆ బహుమతిని అందుకుని సంతోషించారు. 

రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధికి ఇచ్చిన  బహుమతి ఓ క్యూట్ కుక్కపిల్ల. నూరీ అనే జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి కుక్కపిల్లని తల్లి సోనియా గాంధికి ఇచ్చారు రాహుల్ గాంధీ. కుమారుడు ఇచ్చిన కుక్క పిల్లను తీసుకొని సోనియా గాంధీ  ప్రేమతో ముద్దాడారు. హత్తుకున్నారు.  ఈ సందర్భంగా గోవా నుంచి తెచ్చుకున్న పెంపుడు కుక్క పిల్ల నూరీ ఫొటోను షేర్ చేశారు. తన తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చానని రాహుల్ గాంధీకి తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టులో రాహుల్‌ గాంధీ గోవాలో పర్యటించారు. ఆ  సమయంలో పెంపుడు కుక్కల కేంద్రాన్ని నడుపుతున్న దంపతులను కలిశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఆడ కుక్క పిల్లను, తనతో పాటు ఢిల్లీకి తీసుకువచ్చారు. దాన్ని ఒక గిఫ్ట్ బాక్స్‌లో పెట్టి సోనియా గాంధీతోనే తెరిపించారు.  ఈ కుక్కపిల్లను  ఎత్తుకుని ముద్దాడారు.