న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వాన్ని నియంతలు సద్దాం హుస్సేన్, గడాఫీ వంటి వారితో రాహుల్ పోల్చడంపై జోషి మండిపడ్డారు. నియంతలతో భారత ప్రభుత్వాన్ని పోల్చడం ద్వారా దేశ ప్రజానీకాన్ని రాహుల్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కొందరు నియంతలతో భారత ప్రభుత్వాన్ని పోల్చడం ద్వారా రాహుల్ గాంధీ మన దేశాన్ని అగౌరవపరుస్తున్నారు. ఇది ముమ్మాటికీ దేశ ప్రజలను అవమానించడమే. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. కాంగ్రెస్ ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని అనుసరించలేదు. పీవీ నరసింహారావు ఒక్కరు మాత్రమే కాంగ్రెస్‌తోపాటు దేశాన్ని పాలించిన గాంధీయేతర కుటుంబ వ్యక్తి కావడం గమనార్హం’ అని జోషి అన్నారు.
