సోషల్ మీడియాలో విషప్రచారం.. షర్మిల,సునీతలకు రాహుల్ మద్దతు

సోషల్ మీడియా వేదికగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై  జరగుతున్న విష ప్రచారాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు.  వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీ,  తాను అండగా ఉంటానని తెలిపారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపంద చర్య అని రాహుల్ అభిప్రాయపడ్డారు.   దురదృష్టవశాత్తూ  ఇటీవల కాలంలో సోషల్ మీడియాశక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయిందన్నారు రాహుల్ గాంధీ . షర్మిల, సునీతపై  జరిగిన ఈ అవమానకర మైన దాడిని తాను, కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుందని వెల్లడించారు.