కర్ణాటకలో CWC సమావేశాలకు హాజరైన మల్లికార్జున ఖర్గే, రాహుల్

కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. బెలగావిలో 1924లో జరిగిన సమావేశాల్లోనే మహాత్మా గాంధీ తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ చారిత్రాత్మక ఘట్టానికి వందేండ్లు పూర్తవుతుండటంతో.. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది AICC. రెండు రోజులపాటు నవ సత్యాగ్రహ్ బైఠక్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రను ప్రతిబింబించేలా.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి CWC సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు.

బెలగావిలో జరుగుతున్న CWC సమావేశాలకు రాహుల్ గాంధీ, AICC చీఫ్ ఖర్గే హాజరయ్యారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో.. నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమావేశాలను ప్రారంభించారు. కాంగ్రెస్ కు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి మహానుభావుల నాయకత్వం ఉందన్నారు. వారు చూపిన సత్యం, అహింస మార్గంలో.. మోదీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు కాంగ్రెస్ నేతలు.    

ALSO READ | ముఖ్యమంత్రిని చేస్తాం.. పార్టీలోకి వచ్చేయ్ అన్నారు: సోనూసుద్

బెలగావి CWCసమావేశాలకు హాజరు కాలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ఈ చరిత్రాత్మకమైన సమయంలో.. పార్టీ నేతలతో లేకపోవడం బాధాకరమన్నారు. గాంధీజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవడం.. దేశ చరిత్ర, సాతంత్ర్య ఉద్యమంలో పెను మార్పులు వచ్చాయన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో పార్టీ శ్రేణులు నూతనోత్తేజంతో ముందుకు సాగాలన్నారు. ఈ మేరకు లేఖ రాశారు సోనియా గాంధీ.