AFG vs SA 2024: బ్యాడ్ లక్ అంటే ఇతనిదే.. విచిత్రకర రీతిలో ఆఫ్గన్ బ్యాటర్ రనౌట్

క్రికెట్ లో రనౌట్ బాధ భరించలేనిది. అయితే ఇదే రనౌట్ బ్యాడ్ లక్ రూపంలో వస్తే జీర్ణించుకోవడం కష్టమే. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 22) ముగిసిన మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రహ్మత్ షా ఊహించని విధంగా రనౌట్ అయ్యాడు.

ఇన్నింగ్స్ 9 వ ఓవర్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎన్‌గిడి వేసిన బంతిని గర్భాజ్ మిడాన్ దిశగా ఆడాడు. దూరంగా వెళ్తున్న ఈ బంతిని అందుకోవడంలో ఎన్‌గిడి విఫలమయ్యాడు. దీంతో ఈ బంతి నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న రహ్మత్ షా కు తగిలి వికెట్లను తగిలింది. అప్పటికే ఈ ఆఫ్ఘన్ బ్యాటర్ క్రీజ్ దాటడంతో ఔటయ్యాడు. దీంతో కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరాడు. తొలి రెండు వన్డే మ్యాచ్ లు గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.

ALSO READ | ENG v AUS 2024: ఒక్కరికీ 1000 పరుగులు లేవు.. ఇంగ్లాండ్ టాప్ స్కోరర్‌గా బౌలర్ రషీద్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్‌ 89 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుర్బాజ్‌ మినహా ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ రాణించలేదు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్‌ మార్క్రమ్‌ (69 నాటౌట్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (26 నాటౌట్‌) సఫారీలకు విజయాన్ని అందించారు.