అభిమానం చాటుకున్న పెళ్లి కొడుకు

మరికల్, వెలుగు: మండలంలోని ఎలిగేండ్ల గ్రామానికి చెందిన బీజేపీ బూత్​ అధ్యక్షుడు రాఘవేందర్​గౌడ్​ వివాహం ఈ నెల 26న కానుంది. బీజేపీపై ఉన్న వీనాభిమాని అయిన రాఘవేందర్​ శుభలేఖపై ప్రధాని మోదీ, పాలమూరు బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ ఫొటోలను ప్రింట్​ చేయించాడు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే తనకు కానుకలు ఇచ్చినట్లేనని కార్డులో పేర్కొన్నాడు. పెండ్లి కార్డుతో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న రాఘవేందర్​ను పార్టీ నేతలు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్​ మీడియాలో​చక్కర్లు కొడుతోంది.