టీడీపీలోకి రఘురామ.. అక్కడి నుండే పోటీ...!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్ పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమి తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బీజేపీ పార్టీ మొండి చెయ్యి చూపింది. దీంతో చంద్రబాబే తనకు నరసాపురం ఎంపీ టికెట్ ఇప్పించాలని పట్టుబట్టారు. ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని టీడీపీ ఆఫర్ చేస్తున్నప్పటికీ ఆయన అందుకు సుముఖత చూపట్లేదు. ఈ క్రమంలో రఘురామ టీడీపీలో చేరటానికి ముహూర్తం, పోటీ చేసే నియోజకవర్గం కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం అందుతోంది.

ఈ క్రమంలో రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించే దిశగా టీడీపీ బీజేపీతో మంతనాలు జరుపుతోందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన నరసాపురం టికెట్ ను టీడీపీకి ఇచ్చి టీడీపీకి కేటాయించిన ఏలూరు టికెట్ ను బీజేపీకి ఇవ్వాలన్నది బాబు ప్లాన్ అని తెలుస్తోంది. అయితే, బీజేపీ మాత్రం వైజాగ్ టికెట్ డిమాండ్ చేస్తోందట. ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే రఘురామాకు ఉండి అసెంబ్లీ టికెట్ కేటాయించాలన్నది టీడీపీ ప్లాన్ అని తెలుస్తోంది. ఈ మార్పులతో పాటుగా కూటమి అభ్యర్థుల జాబితాలో మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.