టీడీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి తరఫున ఎంపీగా పోటీ చేస్తానని చాలా రోజుల రఘురామ అంటున్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అయితే, చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రఘురామ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.రఘురామ టీడీపీలో చేరటంతో చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెరపడింది. మరి, ఆయన కూటమి తరపున ప్రచారం చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.