2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన కొద్దికాలానికే సీఎం జగన్ మీద వ్యతిరేక స్వరం వినిపించటం మొదలు పెట్టాడు రఘురామ కృష్ణం రాజు. గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా గెలుపొందిన ఆయన వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, ఈ మధ్యనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన టీడీపీ, జనసేన ఉమ్మడి జెండా సభలో కూటమి నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో రఘురామ నరసాపురం నుండి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. బీజేపీతో పొత్తుపై చర్చల సమయంలోనే చంద్రబాబు రఘురామకు ఎంపీ టికెట్ కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రఘురామ టీడీపీలో చేరనున్నారని సమాచారం అందుతోంది. కూటమిలో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు ఆ స్థానాన్ని రఘురామకు ఇచ్చి టీడీపీ తరఫున బరిలో దింపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.