అసెంబ్లీ బరిలో రఘురామ - టీడీపీ అభ్యర్థిగా పోటీ..!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న అంశం మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.మొదట బీజేపీ ఎంపీగా రఘురామ పోటీ చేస్తారని వార్తలొచ్చినప్పటికీ ఇటీవల ప్రకటించిన బీజేపీ జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు. తాజాగా రఘురామ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. రఘురామకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎదో ఒక స్థానం కేటాయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే, గోదావరి జిల్లాలకు సంబంధించి టీడీపీ ఇప్పటికే అబ్యర్ధులను ప్రకటించిన క్రమంలో ఆ జాబితాలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

రఘురామ టీడీపీలో చేరకపోయినప్పటికీ టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన సభలో కూటమి అభ్యర్థిగా ఎదో ఒక స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించాడు. త్వరలోనే రఘురామ టీడీపీలో చేరనున్నాడని, ఉండి నియోజకవర్గం నుండి టికెట్ కేటాయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. రఘురామకు టికెట్ కేటాయించే అంశంలో టీడీపీ అధిష్టానం సానుకూలంగా ఉండటమే కాకుండా ఆయనకు అమరావతి బహుజన జేఏసీ నుండి కూడా మద్దతు వస్తుండటం విశేషం.