రాహుల్ గాంధీకి రాయ్‎బరేలీ కోర్టు సమన్లు

బరేలీ(యూపీ): లోక్‌‌‌‌సభ ఎన్నికల సందర్భంగా ఆర్థిక సర్వేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జనవరి 7న బరేలీ కోర్టులో హాజరుకావాలని సెషన్స్ జడ్జి సుధీర్ కుమార్ సమన్లు జారీ చేశారు. అఖిల భారత హిందూ మహాసంఘ్ సంస్థ మండల అధ్యక్షుడు పంకజ్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ.. “దేశంలో బలహీన వర్గాల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ, వారి చేతిలో ఆస్తి చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అధిక శాతం జనాభా ఉన్నవారు ఎక్కువ ఆస్తులను డిమాండ్ చేయవచ్చు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పాఠక్ ఆగస్టులో ఎమ్మెల్యే, -ఎంపీ కోర్టును ఆశ్రయించారు.