డిసెంబర్ 14న రాధా గోవింద రథయాత్ర.. గండిపేట నుంచి నార్సింగి వరకు ఊరేగింపు

హైదరాబాద్, సిటీ: వెలుగు: హరేకృష్ణ మూవ్​మెంట్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాధా గోవింద రథయాత్ర నిర్వహించనున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించేలా ఊరేగింపు కొనసాగనుంది. గండిపేట శ్రీకృష్ణ గో సేవ మండల్​వై జంక్షన్ నుంచి నార్సింగిలోని హరేకృష్ణ హెరిటేజ్ టవర్ వరకు రథయాత్ర కొనసాగుతుంది. 

సాయంత్రం 4 గంటలకు హెరిటేజ్​టవర్​వద్ద కల్చరల్ కార్నివాల్​ఉంటుంది. రథయాత్రకు సంబంధించిన పోస్టర్​ను హరేకృష్ణ మూవ్​మెంట్​చెన్నై అధ్యక్షుడు  స్టోక కృష్ణ మహారాజ్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌరచంద్ర దాస ప్రభూజీ గురువారం ఆవిష్కరించారు.