IND Vs NZ, 1st Test: మనోడే అడ్డుకున్నాడు: రచీన్ రవీంద్ర సెంచరీతో న్యూజిలాండ్‌కు భారీ ఆధిక్యం

బెంగళూరు టెస్ట్ భారత్ నుంచి చేజారుతుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రచీన్ రవీంద్ర సెంచరీతో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సంపాదించింది. తన సొంతగడ్డ బెంగళూరులో అదరగొట్టాడు. మూడో రోజు తొలి సెషన్ ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. రచీన్ రవీంద్ర (104: 125 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సౌథీ (49) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ తొలి ఇన్నింగ్స్ 299 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మరో రెండు రోజుల ఆట ఉండడంతో భారత్ ఈ మ్యాచ్ లో గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తుంది.

జడేజా మాయ చేసిన రచీన్ అడ్డుకున్నాడు

మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ జడేజా ధాటికి చక చక నాలుగు వికెట్లను కోల్పోయింది. ఉదయం మిచెల్ (18) వికెట్ తీసి సిరాజ్ శుభారంభం ఇచ్చాడు. బ్లండల్ (5) ను బుమ్రా వెనక్కి పంపగా.. ఫిలిప్స్ (14), హెన్రీ (8) వికెట్లను జడేజా తీసుకున్నాడు. దీంతో 231 పరుగులకు 7 వికెట్లను కోల్పోయింది. కాసేపట్లో ఇన్నింగ్స్ ముగుస్తుంది అనుకున్న సమయంలో రచీన్ రవీంద్ర, సౌథీ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

భారత బౌలర్లపై అటాకింగ్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రవీంద్ర తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో సౌథీ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు 8 వికెట్ కు 97 బంతుల్లోనే 112 పరుగులు జోడించడం విశేషం. ఈ ఒక్క సెషన్ లో న్యూజిలాండ్ 165 పరుగులు రాబట్టింది. రెండో రోజు కాన్వే 91 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైంది.