వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైశాలికి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వైశాలి.. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. మంగళవారం రాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో వైశాలి 2.5–1.5తో జు జినెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనా)పై గెలిచి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. కానీ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 0.5–2.5తో జు వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సంతృప్తిపడింది. ఈ టోర్నీలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన చైనా ప్లేయర్లు వరుసగా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించారు. టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జు వెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3.5–2.5తో లీ టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ (చైనా)పై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాగ్నస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నార్వే), ఇయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెపోమినియాట్చి (రష్యా) సంయుక్త విజేతలుగా నిలిచారు.

 కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన మూడు సడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఫలితం రాలేదు. దీంతో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంచుకుంటామని కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రతిపాదనకు నిర్వాహకులు అంగీకారం తెలిపారు. ఈ టోర్నీలో ఇలా టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంచుకోవడం ఇదే మొదటిసారి. ‘మేమిద్దరం అలసిపోయాం. టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కానీ అప్పటికే మేం చాలా  గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడాం. మూడు డ్రాలు అయ్యాయి. ఇక ఆటను కొనసాగించలేనని నేను భావించా. అందుకే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే ప్రతిపాదనను తీసుకొచ్చా’ అని కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్ పేర్కొన్నాడు. ఈ వారంలో కార్ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం.