బీసీ బిల్లుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఏపీ కార్యవర్గ సమావేశం బోను దుర్గానరేశ్​అధ్యక్షతన జరిగింది.

కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చింత శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ, మెండు జ్యోతి, వనమాల శ్రీనివాస్, గజేంద్ర పాల్గొన్నారు.