బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలె: ఎన్​సీబీసీ చైర్మన్​తో  ఆర్.కృష్ణయ్య భేటీ

బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలె: ఎన్​సీబీసీ చైర్మన్​తో  ఆర్.కృష్ణయ్య భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్​చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహిర్​తో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా బీసీ సమస్యలను పరిష్కరించడంలో సహక రించాలని కోరారు. తర్వాత కృష్ణయ్య మీడి యాతో మాట్లాడుతూ..దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడంతో వారు అభివృద్ధి చెందడం లేదన్నారు. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు బడ్జెట్​లో కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమై న మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సిఫార్సులు చేస్తే అందులో ఆర్థికాభివృద్ధికి 16 సిఫార్సులు చేశారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. డిమాండ్లను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.