Kaun Banega Crorepati 16: కౌన్ బనేగా కరోడ్ పతిలో క్రికెట్‌పై లక్ష 60 వేల రూపాయల ప్రశ్న

కౌన్ బనేగా కరోడ్‌పతి 16 వ సీజన్ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో గ్రాండ్ గా కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్రికెట్ పై ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీగా చెప్పేస్తారు. తొలి 8 ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పి 80 వేల రూపాయలను గెలుచుకున్నాడు కంటెస్టెంట్.  లక్ష 60 వేల రూపాయల ప్రశ్న అతనికి క్రికెట్ రూపంలో ఎదురైంది. 

2024 లో బంగ్లాదేశ్ పై టెస్టుల్లో 10.1 ఓవర్లలోనే 100 పరుగులు కొట్టిన జట్టు ఏది అనే ప్రశ్న అడిగారు. దీనికి పాకిస్థాన్, ఇండియా, న్యూజి లాండ్, వెస్టిండీస్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం భారత్. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ పై జరిగిన రెండో టెస్టులో భారత్ జైస్వాల్ విధ్వంసంతో 10.1 ఓవర్లలో 100 పరుగులకు చేరుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 

Also Read :- నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి డబ్బు కారణం కాదు

జైశ్వాల్, రోహిత్ విధ్వంసంతో తొలి 3 ఓవర్లకే భారత్ 50 పరుగులు చేసింది. ఆ తర్వాత జైస్వాల్ విధ్వంసంతో 10.1 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. గిల్, కోహ్లీ, రాహుల్ చెలరేగడంతో వేగంగా 18.2 ఓవర్లలో 150 పరుగులు, 24.2 ఓవర్లలో 200 పరుగులు, 30.1 ఓవర్లలో 250 పరుగులు చేసి ఒకే మ్యాచ్ లో 5 ప్రపంచ రికార్డులు నెలకొల్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నింగ్స్ ఆసాంతం భారత్ వేగం తగ్గకపోవడం విశేషం.