హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ కంపెనీ క్వెంటెల్లి హైదరాబాద్‌లో తమ బిజినెస్‌ను మరింత విస్తరించాలని ప్లాన్స్ వేసుకుంది. ఫుల్ స్టాక్ డెవలపర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, ఆటోమేషన్ ఇంజినీర్లు వంటి జాబ్‌ల కోసం 500 మందిని నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ హైరింగ్‌ను పూర్తి చేయనుంది. 2023 నాటికి వాల్యుయేషన్ ఒక బిలియన్ డాలరుకు పెంచుకోవాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. క్వెంటిల్లి ఇన్నొవేషన్స్ కోసం సపరేట్గా ఒక ల్యాబ్‌ను మెయింటైన్ చేస్తోంది. 2016 నుంచి ఇందులో రీసెర్చ్‌లు చేస్తున్నామని, కరోనా వలన 2020 లో ఎక్స్పెరిమెంట్లు ఆగిపోయాయని ప్రకటించింది.
