అమ్రాబాద్ తరహాలో కవ్వాల్‌‌ టైగర్‌‌ రిజర్వ్ ఫారెస్ట్

  • వన్య ప్రాణులున్న గ్రామాలను తరలిస్తున్నం
  • మండలిలో మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: కవ్వాల్  టైగర్  రిజర్వు ఫారెస్టును క‌‌న్జర్వేటివ్  రిజ‌‌ర్వు ఫారెస్టుగా డిక్లేర్  చేశామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. కవ్వాల్‌‌  టైగర్‌‌  రిజర్వు ఫారెస్టును కూడా అమ్రాబాద్  టైగర్  రిజర్వ్  ఫారెస్ట్  తరహాలో అభివృద్ధి చేస్తామ‌‌ని తెలిపారు. సోమవారం శాసన మండలిలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రత్యేక దృష్టితో అక్కడ‌‌ ప‌‌లు కార్యక్రమాలు చేప‌‌డుతున్నామన్నారు. ఫారెస్టు ఏరియాలో వ‌‌న్యప్రాణుల సంచారం పెర‌‌గ‌‌డంతో అక్కడ ఉండే ప్రాంతాల్లో గిరిజన‌‌, చెంచు ప్రజ‌‌ల‌‌కు ఇబ్బందులు త‌‌లెత్తుతున్నాయని  చెప్పారు.

వ‌‌న్య ప్రాణుల‌‌కు ఇబ్బందులు జ‌‌ర‌‌గ‌‌కుండా ఫారెస్టు ఏరియాలో ఉన్న కొన్ని గ్రామాల‌‌ను త‌‌ర‌‌లించామని వెల్లడించారు. వారికి ప్రత్యేక  స‌‌దుపాయాలు క‌‌ల్పించామని వివ‌‌రించారు. ఇండ్లు క‌‌ట్టించామని, నీటి వ‌‌స‌‌తి క‌‌ల్పించి ఉపాధి మార్గాలు చూపామని పేర్కొన్నారు. 

పులి దాడుల్లో చనిపోతే రూ.10 లక్షల ఆర్థిక సాయం 

పులి దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి సురేఖ చెప్పారు. అట‌‌వీ ప్రాంతాల్లో ఉండే రైతులు, సామాన్య ప్రజ‌‌ల‌‌కు ప్రత్యేకంగా సూచ‌‌నలు చేశామన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పొలం పనులు చూసుకోవాలని సలహా ఇచ్చామన్నారు. జంతువుల దాడిలో చ‌‌నిపోయిన వారికి తమ ప్రభుత్వం అండ‌‌గా ఉంటుంద‌‌న్నారు. ఇంత‌‌కుముందు క్రూరమృగాల దాడిలో చ‌‌నిపోయిన వారి కుటుంబాలకు రూ.5 ల‌‌క్షలు ఇచ్చేవార‌‌ని, త‌‌మ ప్రభుత్వం వ‌‌చ్చిన పరిహారాన్ని రూ.10 ల‌‌క్షలకు పెంచామన్నారు.