భారత్ అప్పీల్​కు ఖతర్​ ఓకే

భారత్ అప్పీల్​కు ఖతర్​ ఓకే

న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల తరఫున కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ ను ఖతర్ కోర్టు విచారణకు స్వీకరించింది. భారత్ అప్పీల్ పై విచారణకు తేదీని తర్వాత నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. ఖతర్ లోని పలు కంపెనీల్లో పని చేస్తున్న భారత్ కు చెందిన 8 మంది నేవీ మాజీ ఆఫీసర్లను గూఢచర్యం ఆరోపణలపై ఖతర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022, ఆగస్టులో అరెస్ట్ చేసింది.

వీరిపై మోపిన అభియోగాల వివరాలను ఖతర్ అధికారులు ఇప్పటివరకూ బహిరంగంగా వెల్లడించలేదు. అనేకసార్లు వీరి బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అయ్యాయి. చివరగా పోయిన నెలలో ఈ 8 మందికీ కోర్టు మరణ శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ.. వారికి దౌత్య సహకారం మొదలుపెట్టింది. ఆఫీసర్లకు విధించిన మరణ శిక్షకు వ్యతిరేకంగా తాజాగా అప్పీల్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది.