భారత స్టార్ బాడ్మింటన్ పీవీ సింధుకు కొరియన్ ఓపెన్ ఆరంభంలోనే నిరాశ ఎదురైంది.ఇవాళ అమెరికాకు చెందిన జంగ్ బీవెన్ తో జరిగిన మ్యాచ్ లో సింధు ఓటమిపాలైంది. దీంతో తొలి రౌండ్లోనే ఈ టోర్నమెంటు నుంచి ఔట్ అయ్యింది. బీవెన్తో 21-7, 22-24, 15-21 తేడాతో సింధూ ఓటమి పాలైంది. తొలి రౌండ్లో పీవీ సింధు ధాటిగా ఆడి పై చేయి సాధించినప్పటికీ… రెండో రౌండ్లో బీవెన్ విజృంభించడంతో వెనక్కితగ్గింది. మూడో రౌండ్లోనూ బీవెన్ ధాటిగా ఆడటంతో.. చివరి రెండు రౌండ్లలో సింధుకి ఓటమి తప్పలేదు.

