సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు

హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పెద్దలు కుదుర్చిన సంబంధంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతుంది బ్యాడ్మింటన్ స్టార్. 2024, డిసెంబర్ 22వ తేదీన రాజస్థాన్‎లోని ఉదయ్‌పూర్‌ వేదికగా సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించింది. 

శనివారం (డిసెంబర్ 14) కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‎ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింధు కలిసింది. ఈ సందర్భంగా తన వివాహానికి అటెండ్ కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసింది. ఇటీవల పీవీ సింధు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ట్రోఫి గెల్చిన విషయం తెలిసిందే. దాదాపు  రెండేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గిన సింధుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

ALSO READ | IND-W vs WI-W: వెస్టిండీస్‌తో భారత మహిళల సమరం.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

ఇదిలా ఉంటే.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. తనకు కాబోయే భర్త వెంకట దత్త సాయితో డిసెంబర్ 14, శనివారం నిశ్చితార్థం జరిగింది.  కటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్మెంట్ ఫోటోను సింధు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. కాబోయే భర్తతో కలిసి సింధు కేక్ కట్ చేయడం ఫొటోలో కనిపిస్తోంది. 

డిసెంబర్ 22న ఆదివారం ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్ళికి భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు సమాచారం. ఇదివరకే ఈ జంట వీరిని తమ వివాహానికి విచ్చేయాలని ఆహ్వానించారు. పివి సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.