అనంతపురం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కీలక నేతలు సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ కీలక నేతలు వేణుగోపాల్, కె పెద్దన్న, వెంకటస్వామి, తిరుపతేంద్ర (జనసేన) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారిని సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు
. చంద్రబాబు పుట్టపర్తి టికెట్ ఇస్తానని..తనకు వెన్నుపోటు పొడిచారని వేణుగోపాల్ ఆరోపించారు. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత పుట్టపర్తి టికెట్ రఘునాథరెడ్డి కోడలికి కేటాయించారని తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ నేతలు ... పచ్చ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో మైనార్టీలకు అవమానాలు తప్ప అధికారాలు లేవంటూ ఆయన ఆరోపించారు. టికెట్ ఇస్తానని మాట తప్పిన చంద్రబాబుతో ఇక కలిసి పని చేయలేమని ఆయన అన్నారు.పుట్టపర్తిలో తనకు టికెట్ ఇవ్వలేదని వేణుగోపాల్ వాపోయారు.