- అన్ని ప్రాంతాలకు సర్వీసులను విస్తరించాలని నిర్ణయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు పుష్పక్బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ.. మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసులను విస్తరించాలని నిర్ణయించింది. ఇక నుంచి దాదాపు సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి పుష్పక్బస్సులు నడపాలని డిసైడైంది.
ప్రస్తుతం జేబీఎస్, ఎంజీబీఎస్, ఎన్జీఆర్ఐ, ఎల్బీనగర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మియాపూర్, బీహెచ్ఈఎల్ప్రాంతాల నుంచే పుష్పక్బస్సులు నడుస్తున్నాయి. ఇటీవల ఎన్జీఓస్కాలనీ నుంచి కొండాపూర్మీదుగా లింగంపల్లి వరకూ పొడిగించింది.
ఈ బస్సు ఆల్విన్‌క్రాస్‌రోడ్స్, హఫీజ్‌పేట, కొత్తగూడ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలను కవర్చేస్తుంది. తాజాగా తుక్కుగూడ నుంచి ఎయిర్‌పోర్టు రూట్లో పుష్పక్బస్సులు నడపాలని నిర్ణయించింది. ఇలా పుష్పక్సర్వీసులు తిరిగే రూట్లను పెంచుకుంటూ పోతుంది.
500 ఎలక్ట్రిక్బస్సుల కొనుగోలుకు నిర్ణయం
పెరుగుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు అనుగుణంగా త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బస్సులు కలిపి 2,800 వరకు ఉన్నాయని, దశల వారీగా పాతబస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెడుతున్నామన్నారు. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు, మిగిలినవి మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.