పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుడి చెవి కొరికిన థియేటర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే.?

పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుడిపై థియేటర్ సిబ్బంది దారుణంగా దాడి చేసి గాయపరిచిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తివివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని గ్వాలియర్ పరిసరప్రాంతంలో షబ్బీర్ ఖాన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి దగ్గరిలో ఉన్న కాజల్ టాకీస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా చూసేందుకు వెళ్ళాడు. ఇక్కడివరకూ బాగానే ఉంది. అయితే ఇంటర్వెల్ సమయంలో పాప్ కార్న్ కొనుక్కనేందుకు థియేటర్ లో ఉన్నటువంటి కాంటీన్ కి వెళ్ళాడు. 

పాప్ కార్న్ ధరల విషయంలో థియేటర్ సిబ్బందితో గొడవ జరిగింది. ఈ గొడవలో థియేటర్ సిబ్బంది షబ్బీర్ పై దారుణంగా దాడి చేశారు. ఈ క్రమంలో షబ్బీర్ చెవిని కొరకడంతో తీవ్ర రక్త స్రావానికి గురయ్యాడు. దీంతో స్థానికులు వెంటనే షబ్బీర్ ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్ప 2 సినిమాలోని ఓ సన్నివేశంలో మాదిరిగానే నిందితులు షబ్బీర్ పై దాడి చేశారు. 

ALSO READ | మంచు ఫ్యామిలీ ఫైట్: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట

ఈ క్రమంలో షబ్బీర్ కి దాదాపుగా 8 కుట్లు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు  వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే బాధితుడు షబ్బీర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా IPC సెక్షన్లు 294, 323  మరియు 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.