త్రిప్తి డిమ్రితో రొమాన్స్: ఇడియట్గా బాలీవుడ్‌‌కు వెర్సటైల్‌‌ యాక్టర్‌

ఓవైపు హీరోగా మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న ఫహద్ ఫాజిల్..  మరోవైపు ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెర్సటైల్‌‌ యాక్టర్‌‌‌‌గా మెప్పిస్తున్నాడు. ఇటీవల ‘పుష్ప 2’లో షెకావత్‌‌ పాత్రతో మరోసారి ఆకట్టుకున్న ఫహద్.. ఇప్పుడు హీరోగా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు.

జబ్ వుయ్ మెట్, రాక్ స్టార్ చిత్రాల దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫహద్‌‌కు జంటగా ‘యానిమల్‌‌’ఫేమ్ త్రిప్తి డిమ్రి నటించనుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌కు టైటిల్‌‌ను ఫైనల్ చేశారు.

టర్కీ నేపథ్యంలో జరిగే స్టోరీ కావడంతో ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్‌‌’అనే టైటిల్‌‌ను ఎంపిక చేశారు. మూడు నెలల పాటు ఇండియా, యూరప్‌‌లో షూటింగ్ చేయనున్నారు.