Pushpa 2 Box office Day 18: నాన్‍స్టాప్‍ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీకి వసూళ్లు ఇంకా జోరుగా సాగుతున్నాయి. రిలీజై 18రోజులైనా కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మూడవ ఆదివారం (డిసెంబర్ 22 నాటికి).. అంటే 18వ రోజు రూ.33.25 కోట్లు రాబట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద రూ.5.7 కోట్ల నెట్, హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.26.75 కోట్ల నెట్ వసూలు చేసింది. 

మొత్తం మూడవ వారంలో  పుష్ప 2 భారతదేశంలో రూ. 57 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఈ సినిమా కేవలం ఇండియాలోనే రూ.1029.65 కోట్లు సాధించింది. ఓవర్సీస్ లో రూ.240 కోట్లు రాబట్టింది.

అయితే, పుష్ప 2 మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్గా రూ.1,500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి చరిత్ర స్పృష్టించింది. అంతేకాకుండా హిందీ నెట్ కలెక్షన్లు 16 రోజుల్లోనే రూ.645కోట్లు అధిగమించింది. ఈ మాస్ ఫీస్ లెక్కలతో స్త్రీ 2 మూవీని వెనక్కి నెట్టింది. దీంతో బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ రికార్డ్ ను పుష్ప 2 సొంతం చేసుకుంది. 

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు.

ఇండియా పుష్ప 2 నెట్ కలెక్షన్స్:

1వ వారం: రూ. 725.8 కోట్లు
2వ వారం: రూ. 264.8 కోట్లు
16వ రోజు: రూ. 14.3 కోట్లు
17వ రోజు: రూ. 24.75 కోట్లు
18వ రోజు: రూ. 33.25 కోట్లు
 

మొత్తం: రూ. 1062.9 కోట్లు