ఆమనగల్లులో జగన్నాథుడికి జననీరాజనం

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో శుక్రవారం పూరీ జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. హైదరాబాద్ కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రను పట్టణంలోని అయ్యప్ప కొండ నుంచి మార్కండేయ దేవాలయం వరకు సాగింది.

భక్తులు మూడు కి.మీ వరకు స్వామివారి రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల భజనలు, కోలాటాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.