దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథ యాత్ర జూలై 1నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే జగన్నాథునికి స్నాన యాత్రను నిర్వహించిన ఆలయ నిర్వాహకులు.. అనంతరం 15 రోజుల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అయితే త్వరలోనే జగన్నాథుని యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో రథయాత్రకు ఉపయోగించే 3 రథాల నిర్మాణ పనులను ఇప్పటికే చేపట్టిన ఆలయ అధికారులు.. ఈ పనులు దాదాపు 85 నుంచి 85శాతం వరకు పూర్తయయ్యానని తెలిపారు. వీటిని సాంకేతిక కమిటీ సభ్యులు పరిశీలించి అవసరమైన సూచనలనిస్తున్నారని ఆలయ అధికారి అజయ్ కుమార్ జెనా చెప్పారు. వీటితో పాటు రంగు రంగుల బొమ్మల చిత్రాలను, ఆకృతులను చిత్రకారులు అందంగా తీర్చిదిద్దుతున్నారు.
