IPL 2025 Mega Action: విమర్శించినా అతనే కావాలంట: ఆసక్తి చూపించని ప్లేయర్‌ను కొన్న పంజాబ్

తొలి రోజు మెగా ఆక్షన్ లో భాగంగా ఊహించని ట్విస్ట్ చోటు  చేసుకుంది. కొంతమంది ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడుపోతే మరికొందరు తక్కువ ధరకే వచ్చేశారు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఇది జరిగేదే అయినా ఈ సారి మెగా ఆక్షన్ లో ఒక విషయం ఆసక్తిని కలిగిస్తుంది. పంజాబ్ కింగ్స్ ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ను సొంతం చేసుకొని షాక్ ఇచ్చింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 

4.20 కోట్లకు మ్యాక్స్ వెల్ ను.. వేలంలో దక్కించుకున్నారు. అయితే మ్యాక్ వెల్ కు పంజాబ్ కు వెళ్లడం ఆసక్తి లేదు. మ్యాక్స్ వెల్ గతంలో పంజాబ్ జట్టుతో తనకు చేదు అనుభవాలు ఉన్నాయని తెలిపాడు. దీంతో అతన్ని పంజాబ్ కొనదని అందరూ ఊహించారు. అయితే మ్యాక్ వెల్ 2025 ఐపీఎల్ పంజాబ్ జట్టుకు ఆడబోతున్నారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

Also Read :- ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట

మ్యాక్స్ వెల్ కోసం వేలంలో ఎవరూ ఆసక్తి చూపించలేదు. పేలవ ఫామ్ కారణంగా కేవలం 4.2 కోట్లకే సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో బెంగళూరు జట్టు మ్యాక్స్ వెల్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే నిరాశపరిచాడు. 6 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఈ సారి మ్యాక్స్ వెల్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cricket Candid (@cricandid)