IPL Auction 2025: సన్ రైజర్స్‌కు జస్ట్ మిస్.. రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు భారత బౌలర్

ఐపీఎల్ మెగా ఆక్షన్ తొలి ప్లేయర్ వేలం హోరీహోరీగా సాగింది. భారత బౌలర్ అర్షదీప్ సింగ్ కోసం పోటీపోటీగా ఫ్రాంచైజీలు పోటీ పడ్డారు. ఈ టీమిండియా పేసర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరను అందుకున్నాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. వేలంలో ఈ భారత ఫాస్ట్ బౌలర్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ కొనడానికి పోటీ పడ్డారు. చివరికి పంజాబ్ అతన్ని RTM కార్డు ఉపయోగించి వేలంలో అతన్ని దక్కించుకుంది. 

సన్ రైజర్స్ ఆర్షదీప్ కోసం చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అర్షదీప్ ఇటీవలే పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతని మీద నమ్మకముంచిన పంజాబ్ అతన్ని కోసం RTM ఉపయోగించింది. పంజాబ్ చివరి మూడు సీజన్ లలో పంజాబ్ టాప్ బౌలర్. ఆన్ క్యాప్డ్ ప్లేయర్స్ ప్రభుమాన్ సింగ్‎కు రూ.4 కోట్లు, శశాంక్ సింగ్‎కు రూ.5.4 కోట్లు చెల్లించి పంజాబ్ రిటైన్ చేసుకుంది. 

2019 లో పంజాబ్ జట్టులో చేరిన అర్షదీప్ సింగ్ ఆ జట్టుకు మూల స్థంభంలా నిలిచాడు. పంజాబ్ తరపున 65 మ్యాచ్ ల్లో 76 వికెట్లు తీసి అత్యంత నిలకడగా రాణించాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో అర్షదీప్ సింగ్ సభ్యుడు. అర్షదీప్ సింగ్ తో పాటు హర్షల్ పటేల్, సామ్ కర్రాన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లను పంజాబ్ కింగ్స్ వదిలేసుకుంది.