న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మొదలయ్యే విమెన్స్ ఐపీఎల్‌లో ఒక టీమ్‌ను సొంతం చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కో ఓనర్ నెస్ వాడియా చెప్పారు. ‘విమెన్స్ కోసం ఐపీఎల్ నిర్వహిస్తామని చాలా కాలం నుంచి చెబుతున్నారు. ఈ టోర్నీ మొదలైతే చాలా ప్రత్యేకంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో విమెన్స్ క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతోంది. అమ్మాయిల ఆటపై అందరిలో చాలా ఆసక్తి ఉంది. ఈ టోర్నీలో మన టీమ్ సెమీస్‌కు ముందే ఓడిపోవడం చాలా బాధ కలిగించింది. ఐపీఎల్‌లో విమెన్స్ టీమ్‌కు ప్రారంభ ధర ఎంత ఉండాలనేది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంటుంది. ఓ టీమ్‌ను తీసుకొమ్మని మమ్మల్ని అడిగితే కచ్చితంగా ముందుకొస్తాం. అందుకు మేం చాలా ఆసక్తిగా ఉన్నాం. విమెన్స్ ఐపీఎల్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది’ అని వాడియా చెప్పుకొచ్చారు.
