424 మందికి భద్రత పునరుద్ధరణ

424 మందికి భద్రత పునరుద్ధరణ

భద్రత తొలగింపుపై పంజాబ్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 424 మందికి జూన్ 07వ తేదీలోపు భద్రతను కల్పిస్తామని కోర్టుకు సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం హామీనిచ్చింది. పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో భద్రతా తొలగింపుపై చర్చ జరిగింది. భద్రత తొలగింపు వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తన భద్రతను ఉపసంహరించుకోవడంపై మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సందర్భంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై జూన్ 02వ తేదీలోగా సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. భద్రతా విషయంలో సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 

ఏ ప్రాతిపదికన రాష్ట్రంలోని అనేక మంది భద్రతను ఉపసంహరించారని, తదితర వివరాలను వెల్లడించాలని హైకోర్టు సూచించింది. దీనితో ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. మరోవైపు సిద్ధూ హత్య కేసులో పోలీసుల కస్టడీకి తనను అనుమితించవద్దని.. ఇందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ Lawrence Bishnoi కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని హత్యలో లారెన్స్ ప్రమేయం పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలకు భద్రతను ఉపసంహరించడం ప్రధాన అంశం. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధూ హత్యతో భద్రతను పునరుద్ధరించాలనే డిమాండ్స్ వినిపించాయి. హైకోర్టు ఆదేశాలతో పంజాబ్ ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించనుంది.

మరిన్ని  వార్తల కోసం : -
కోతుల మధ్య ఆప్యాయత..మనుషులను మించి..


చదువు కోసం సాహసం.. ప్రమాదకరంగా బాలల ప్రయాణం