చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసానికి చండీగఢ్ మున్సిపల్ అధికారులు శనివారం భారీ జరిమాన విధించారు. చండీగఢ్‌లోని సీఎం ఇంటిలోని సిబ్బంది.. అక్కడి స్థానికులకు ఇబ్బంది కలిగేలా చెత్త వేసినందుకు రూ. 10వేలు ఫైన్ వేశారు.
ఈ మేరకు సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటిండెంట్ హర్జీంద్ సింగ్ పేరిట అధికారులు చలాన్ జారీ చేశారు. దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్దూ స్పందించారు.
సీఎం నివాసం నుంచి చెత్త వేస్తున్నట్లు.. స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు అందాయన్నారు. అందువల్లే చలాన్ వేసినట్లు చెప్పారు.
