పునీత్ కళ్లతో నలుగురికి కంటి చూపు

పునీత్ కళ్లతో నలుగురికి కంటి చూపు

బెంగళూరు: ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన  కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ కళ్లను నలుగురికి  అమర్చారు. శుక్రవారం  గుండెపోటుతో చనిపోయిన పునీత్ కళ్లను ..అదే రోజు నారాయణ నేత్రాలయ డాక్టర్లు సేకరించి నలుగురికి అమర్చారు. టెక్నాలజీతో పునీత్ కళ్ల ఒక్కో కార్నియాను పై పొర, లోపలి పొరగా వేరు చేసి నలుగురికి అమర్చారు. పైపొర సమస్యతో బాధపడే ఇద్దరికి, లోపలి పొరతో బాధపడే  మరో ఇద్దరికి పునీత్ కళ్లను అమర్చినట్లు డాక్టర్లు చెప్పారు.  దీంతో పునీత్ కళ్లు నలుగురికి చూపును ఇచ్చినట్లు అయ్యింది. గతంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్ కూడా కళ్లను దానం చేశారు. ఇపుడు పునీత్ చనిపోయిన తర్వాత కూడా కళ్లు డొనేట్ చేసి నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడు.