బస్సెక్కిన గవర్నర్ తమిళిసై

బస్సెక్కిన గవర్నర్ తమిళిసై

పుదుచ్చేరి ఇన్ ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై బస్సులో ప్రయాణించారు. ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైతే రాజ్ భవన్ కు వచ్చి తనను కలవాలని ప్రజలకు సూచించారు తమిళిసై. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. దీంతో ఇన్ ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళి సై అధికారిక వ్యవహారాలతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఫిర్యాదుకు స్పందించిన తమిళిసై బస్సులో ప్రయాణించారు.