తన పాటలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన గౌరవార్థం పుదుచ్చేరిలోని ఓ బేకరీ.. బాలు చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసింది. ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జుకా చాక్లెట్ కేఫ్ చెఫ్ రాజేంద్రన్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్‌తో నిర్మించిన ఈ విగ్రహం బరువు 339 కిలోలు మరియు ఎత్తు 5.8 అడుగులు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటల సమయం పట్టిందని కేఫ్ బృందం పేర్కొంది. ప్రజల సందర్శనార్థం ఈ విగ్రహాన్ని జనవరి 3 వరకు అందుబాటులో ఉంచుతామని కేఫ్ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 5న కరోనావైరస్ బారినపడిన బాలు.. ఆగస్టు 13న మరింత అనారోగ్యానికి గురయ్యారు. వైరస్ ప్రభావంతో ఆయన ఊపిరితిత్తుల చెడిపోవడంతో సెప్టెంబర్ 25న మరణించారు.
గతంలో ఈ కేఫ్ నిర్వాహకులు మహత్మగాంధీ, సూపర్ స్టార్ రజినీకాంత్, ఎంఎస్ ధోని, చార్లీ చాంప్లిన్, ఏపీజే అబ్దుల్ కలాం, ఆర్మీ కమాండర్ అభినందన్‌ల చాక్లెట్ విగ్రహాలు కూడా తయారుచేశారు.
For More News..
గోవింద నామస్మరణతో మారుమోగుతున్న తిరుమల
నిప్పంటించుకున్న మహిళ.. కాపాడబోయిన సీఐకి మంటలు
అనాథను చదివించిన హరీష్ రావు.. పెండ్లి కూడా చేసిండు
