న్యూఢిల్లీ: టెలికం పాలసీలో భాగంగా ఈ ఏడాది కోటి పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఏకంగా 2–3 కోట్ల జాబ్స్ క్రియేట్ అవుతాయని టెలికం సెక్రెటరీ కే రాజారమన్ అన్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫారమ్ (బీఐఎఫ్) ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రధాన్ మంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (పీఎం–వాని)ను విస్తరించడానికి వైఫై ఎక్విప్‌మెంట్లను తయారు చేసే కంపెనీలు రేట్లను తగ్గించాలని అన్నారు. ‘ఒక వైఫై హాట్‌స్పాట్ వలన డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్‌గా 2–3 జాబ్‌లు క్రియేట్ అవుతాయి. దీన్ని బట్టి మొత్తం కోటి హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేస్తే 2–3 కోట్ల జాబ్‌లను క్రియేట్ చేయొచ్చు’ అని రాజారమన్ పేర్కొన్నారు. కాగా, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి కోటి హాట్‌స్పాట్‌లను పెట్టాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. రూరల్ ఎకానమీని మెరుగుపరచడంలో ఇవి సాయపడతాయని అంచనావేస్తోంది. పీఎం–వాని పోర్టల్ ప్రకారం, ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 56 వేల వైఫై హాట్‌స్పాట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
