న్యూఢిల్లీ: పబ్‌జీ మొబైల్ ఇండియా పేరుతో ఇండియాలో పబ్‌జీ కొత్త వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసమే ఈ వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ వెర్షన్‌లో ఇండియన్ యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. వీడియో గేమ్స్‌తోపాటు ఈ-స్పోర్ట్స్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పబ్‌జీ కార్పొరేషన్ పేరెంట్ కంపెనీ క్రాఫ్టన్ భారత్‌లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండటం గమనార్హం. పబ్‌జీతోపాటు పలు రకాల వీడియో గేమ్స్‌ను ఇండియన్ గేమర్స్‌కు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నామని కంపెనీకి చెందిన డెవలపర్ అధికారికంగా చెప్పారు.
