పబ్జీ గేమ్ ఎప్పుడు పున ప్రారంభమవుతుందనే అంశంపై భారత్ లో తెగ చర్చలు జరుగుతున్నాయి. అంతలా యువత ఎడిక్ట్ కావడంతో ఆ గేమ్ నుంచి బయటపడలేకపోతున్నారు. తాజాగా ఈ గేమ్ భారత్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకునేందుకు నవంబర్ 30న పలువురు ఔత్సాహికులు ఆర్టీఐ ద్వారా సంబంధిత శాఖను సమాచారం కోరారు. ఈ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. పబ్జి ప్రారంభం కోసం కేంద్రం ఎటువంటి అనుమతి ఇవ్వలేదని అందులో ప్రకటించింది. కాగా పబ్జీ గేమ్ డెవలపర్లు తెలిపిన వివరాల ప్రకారం ..,ఇండియన్ కల్చర్ ప్రతిబింబిచేలా గేమ్ ను రీడిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నపిల్లలకు ఎక్కువ సేపు ఆ గేమ్ పై టైమ్ స్పెండ్ చేయకుండా సెట్టింగ్స్ మార్చడమే కాదు. క్యాస్ట్యూమ్స్ సైతం మారుస్తున్నట్లు సమచారం. ఇప్పటికే కొన్ని పబ్జి గేమ్ ఏపీకే లింకులు బయట కనిపిస్తున్నాయి. అయితే, హ్యాకర్స్ ఈ ఏపీకే లింకులు ద్వారా మీ మొబైల్ ని హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.
