వేసని నుంచి మూగజీవాలను కాపాడేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని జూలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూలో వన్యప్రాణుల సంరక్షణకు కూలర్లను ఏర్పాటు చేశారు. పక్షుల కోసం ఎయిర్ కండీషనర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టారు. జంతువులు ఉండే చోట స్ప్రింకర్లు, చిన్న రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల ఎన్ క్లోజర్ల పైకప్పుపై గడ్డిని ఏర్పాటు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. వేసవిలో పుట్టిన వన్యప్రాణులపై మరింత శ్రద్ధ తీసుకుంటూ అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు జూపార్కు క్యూరేటర్.
