Provident fund big update: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇకనుంచి PF ను డైరెక్టుగా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..పీఎఫ్ డ్రా చేసుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు..సాధారణంగా పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకో వడానికి పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల పనిదినాల తర్వాత అకౌంట్‌లోకి డబ్బు జమ అవుతుంది. 

ఇదంతా పెద్ద ప్రాసెస్‌ అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఏటీఎం కార్డుల ద్వారా పీఎఫ్ డ్రా చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

 2025 నుంచి EPFO ​చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లను నేరుగా ATMల నుండి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా బుధవారం(డిసెంబర్ 11)  పెద్ద ప్రకటన చేశారు.

ALSO READ | Flipkart and Myntra: ప్లిప్కార్ట్, మింత్రా యూజర్లకు షాక్..ఇకపై ఆర్డర్ క్యాన్సలేషన్పై ఛార్జీలు!

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్‌ అకౌంట్‌ ఉంటుందని మనకు తెలుసు. ప్రతీ నెల ఉద్యోగి జీతంలో 12 శాతాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాని కూడా అదే మొత్తంలో జమ చేస్తారు. పీఎఫ్‌ ఖాతా అనేది మంచి పొదుపు పథకం.

ఇందులో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నపలంగా డబ్బు అవసరపడితే ఈ మొత్తాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)  70 మిలియన్లకు పైగా యాక్టివ్ సబ్ స్క్రైబర్లను కలిగి ఉంది. వారి సౌకర్యం కోసం EPFO ​సేవలను మరితం సులభతరం చేస్తోంది. 

EPFO 3.0 పథకం కింద పీఎఫ్ ఖాతాదారుల కోసం కొత్త సౌకర్యాలను కల్పిస్తోంది. EPFO 3.0 కింద PF ఖాతాదారులకు త్వరలో ఏటీమ్‌ కార్డును పోలిన ఒక కార్డును ఇవ్వనున్నారు. దీని సహాయంతో ఈపీఎఫ్‌ఓ మెంబర్స్‌ పీఎఫ్‌ ఖాతా నుంచి ఏటీఎమ్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్‌ఓ 3.0 విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. 2025  -జూన్ నాటికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.