దుబ్బాకలో మంత్రి ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ గొడవ

  • దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి హాజరైన కొండా సురేఖ
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిని స్టేజీపైకి ఆహ్వానించిన మంత్రి
  • అడ్డుకున్న ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు, పోటాపోటీ నినాదాలు

దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ వివాదం నెలకొంది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎంపీ మాదవనేని రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. చెక్కుల పంపిణీకి ముందు మంత్రి కొండా సురేఖ పిలుపుతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి చెరుకు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డిని స్టేజీపైకి వచ్చారు. 

దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పగా, ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ లేని వ్యక్తులు స్టేజీపైకి రావొద్దని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ లేని వ్యక్తిని స్టేజిపైకి ఎలా పిలుస్తారంటూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దుబ్బాక పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణగౌడ్‌ స్టేజీ పైకి ఎక్కడంతో గొడవ మొదలైంది. స్టేజిపైకి ఎక్కిన వంశీకృష్ణను పోలీసులు కిందకు దించేశారు. అయితే శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డిని స్టేజీ పైనుంచి దించాలని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు

అక్కడే ఉండనివ్వాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు నినాదాలు చేశారు. ఒకానొక దశలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు స్టేజీ పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. గొడవపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు గొడవకు ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

బెదిరింపులకు భయపడేది లేదు :మంత్రి కొండా సురేఖ

దుబ్బాక నియోజకవర్గంలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటికి భయపడేది లేదని మంత్రి సురేఖ అన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ తీసుకుంటుందన్నారు. పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఇంతకంటే ఎక్కువ రాజకీయమే చేశారన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో అనేక మంది ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ లేకుండానే స్టేజీ మీదకు వచ్చి కూర్చున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్టేజీ మీదకు వస్తే మీ ఎమ్మెల్యే పదవి ఏమైనా పోతుందా ? అని ప్రశ్నించారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు వెంటనే అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచించారు. 

వచ్చే నెలలో డిజిటల్‌‌‌‌‌‌‌‌ రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు జారీ

మెదక్, వెలుగు : వచ్చే నెల ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌లో డిజిటల్‌‌‌‌‌‌‌‌ రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు. గురువారం మెదక్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం, పెన్షన్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అన్ని అంశాలను ఒకే కార్డులో పొందుపరిచేలా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ వేర్‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తున్నామన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఈ జిల్లాకు సుమారుగా రూ.1,100 కోట్లు కేటాయించామన్నారు. 

వడ్లు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపించాలని సూచించారు. ఏడుపాయల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు మెదక్‌‌‌‌‌‌‌‌ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు కృషి చేయాలని, మ్యాచింగ్‌‌‌‌‌‌‌‌ గ్రాంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.