న్యూఢిల్లీ: రైతులు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన నిరసనలను అక్టోబర్ వరకు ఆపబోమని తికాయత్ స్పష్టం చేశారు. ‘చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇళ్లకు వెళ్లబోమనేదే మా నినాదం. ఇప్పట్లో ఉద్యమానికి స్వస్తి చెప్పే ఆలోచనలు లేవు. ఈ నిరసనలను అక్టోబర్ వరకు ఆపే ప్రసక్తే లేదు’ అని తికాయత్ తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్న రైతులను విడుదల చేసేంత వరకు ప్రభుత్వంతో చర్చలు జరపేది లేదని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.
