దేశవ్యాప్తంగా డాక్టర్ల దీక్ష..కోల్​కతా వైద్యురాలి మర్డర్​పై​ నిరసన

  • పలు సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా వైద్యుల ప్రకటన
  • వారంలోగా కేసు పరిష్కరించాలని పోలీసులకు బెంగాల్​ సీఎం ఆర్డర్​
  • అవమానంతో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజైన్​

న్యూఢిల్లీ : బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజధాని కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైద్య కళాశాల, దవాఖానలో  జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్​ అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ది ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఫోర్డా) ఆధ్వర్యంలో సోమవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలను బంద్​ పెట్టారు. ఉదయం 9 గంటల నుంచి నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఢిల్లీలోని కేంద్ర ఆధీనంలోగల ఎయిమ్స్​తోపాటు ఆర్ఎంఎల్, సఫ్దర్​గంజ్​ హాస్పిటల్​ వైద్యులు ఇందులో పాల్గొన్నారు. ​

ఓపీడీలు, ఆపరేషన్​ థియేటర్స్​, వార్డ్​ డ్యూటీలను బంద్​ చేశారు. అయితే, రోగులకు ఇబ్బంది కలగవద్దని ఎమర్జెన్సీ సేవలను మాత్రం యాథావిధిగా కొనసాగించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు పలు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాతో పాటు అనేక ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

“బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని మేం కోరుతున్నాం. మనుషుల ప్రాణాలను రక్షించే ప్రదేశంలో ఇలాంటి దారుణం జరగడం వైద్య సిబ్బందికి పొంచి ఉన్న ముప్పును సూచిస్తున్నది” అని ఎయిమ్స్​ ఆర్​డీఏ జనరల్​ సెక్రటరీ డాక్టర్​ రఘునందన్​ దీక్షిత్​ పేర్కొన్నారు.

అంత జాప్యమెందుకు? : జూనియర్​ డాక్టర్లు

కేసును ఏడు రోజుల్లోగా పరిష్కరించాలని పోలీసులకు సీఎం మమతా బెనర్జీ జారీచేసిన అల్టిమేటంపై ఆర్​జీ కార్​ మెడికల్ ​కాలేజీ, హాస్పిటల్​ జూనియర్​ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేసు విచారణకు అంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ కేసుపై న్యాయ విచారణ జరిపించాలని, దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని, బాధితురాలి కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అప్పటివరకూ తమ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసును మొదట పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత హత్య అంటూ మాటమార్చారని అన్నారు. దీనిపై కోల్​కతా పోలీసులు వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు.  

రాజీనామా చేసిన కాలేజీ ప్రిన్సిపాల్

జూనియర్ ​డాక్టర్​పై అత్యాచారం, హత్య జరిగిన కోల్​కతాలోని ఆర్​జీ కార్​ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ​ఘోష్​​ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా సందీప్​ ఘోష్​ మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై జూనియర్​ డాక్టర్లు, వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన పదవికి రాజీనామా చేయాలని మెడికల్​స్టూడెంట్లు డిమాండ్​ చేశారు. దీంతో సందీప్​ఘోష్​​తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఘోష్​ మాట్లాడుతూ..

మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ఎక్కడా మాట్లాడలేదని, ఆమె కూడా తన కూతురులాంటిదేనని అన్నారు. సోషల్​మీడియాలో తనపై జరుగుతున్న దాడిని, అవమానాన్ని తట్టుకోలేకే పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

పోలీసులకు సీఎం మమత అల్టిమేటం

జూనియర్​ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును వచ్చే ఆదివారంలోగా  పరిష్కరించాలని పోలీసులకు బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ అల్టిమేటం ఇచ్చారు. అప్పటికీ పరిష్కరించకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని చెప్పారు. సోమవారం ఆమె మృతురాలి ఇంటికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్​ చేశారని, ఇంకా నిందితులెవరైనా ఉంటే ఆదివారంలోగా అరెస్ట్​ చేస్తామని చెప్పారు.

ఈ కేసుపై ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ జరగాలని, దోషులకు మరణశిక్ష పడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘పోలీసులు నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని నేను కోరుతున్నా. ఆదివారంలోగా వారు కేసును ఛేదించలేకపోతే సీబీఐకి అప్పగిస్తాం. ఈ కేసును కేంద్ర ఏజెన్సీ స్వాధీనం చేసుకోవడంలో నాకు సమస్య లేదు, కానీ దాని సక్సెస్ రేటు తక్కువగా ఉంది” అని మమత వ్యాఖ్యానించారు.