తిండిపెట్టే వాడికి మండితే.. ట్రాక్టర్లతో భారీకేడ్లను తొలగించేందుకు తిరగబడ్డ రైతులు

తిండిపెట్టే వాడికి మండితే.. ట్రాక్టర్లతో భారీకేడ్లను తొలగించేందుకు తిరగబడ్డ రైతులు

తిండిపెట్టే  వాడికి మండితే ఏం చేస్తారో నిరూపిస్తున్నారు రైతులు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ కిషన్ యూనియన్ రైతులు ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ – ఢిల్లీ బోర్డర్ లో రైతులు ఢిల్లీకి రాకుండా ఉండేందుకు పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ట్రాక్టర్లతో భారీకేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు  రైతుల భారీ నిరసనల మధ్య కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చే సమయంలో రైతులకు కొన్ని అపోహలుంటాయని అన్నారు.  అక్టోబర్ 14 మరియు నవంబర్ 13 న  రైతు నాయకులతో రెండు సార్లు చర్చలు జరిపినట్లు చెప్పిన ఆయన.. చర్చలు జరిగే సమయంలో ఆందోళన చేయవద్దని రైతుల్ని కోరామని, మరోమారు ప్రభుత్వం రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చామని వెల్లడించారు. చలి మరియు కరోనాను దృష్టిలో ఉంచుకొని  డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో చర్చకు ఆహ్వానించామన్నారు.