ఉత్తరాఖండ్ లో రైతుల ఆందోళన ఉద్రిక్తత రేపింది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా బాజ్ పూర్ లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీసంఖ్యలో వచ్చిన రైతులు… బారికేడ్లపైకి ట్రాక్టర్లను ఎక్కించారు. ట్రాక్టర్లపై ముందుకు కదిలిన నిరసనకారులను పోలీసులు ఆ తర్వాత ఆపేశారు.
#WATCH | Protesters agitating against the new farm laws run a tractor over a police barricade in Bajpur, of the Udham Singh Nagar district in Uttarakhand pic.twitter.com/aI97qNcg0U
— ANI (@ANI) December 25, 2020
